రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- December 13, 2025
హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం నాడు జరిగిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మరియు సిబ్బందిని డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి అభినందించారు.ఎలాంటి చిన్న లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని, వారికి సహకరించిన ఇతర పోలీసు అధికారులను డిజిపి ప్రశంసించారు.ఈ సందర్భంగా డిజిపి బి. శివధర్ రెడ్డి స్వయంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ, మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో తాము భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా, శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటనతో అప్రమత్తమై, అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని, ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని డిజిపి వివరించారు.అభిమానులు ఎవరూ గ్రౌండ్ లోపలికి వెళ్లకుండా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసి, గ్రౌండ్ చుట్టూ రోప్ పార్టీలను నియమించి పటిష్ట బందోబస్తు నిర్వహించామని డిజిపి పేర్కొన్నారు.ఈ కార్యక్రమ విజయంలో సహకరించిన ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు, మెస్సీ అభిమానులకు కూడా డిజిపి బి.శివధర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







