మళ్ళీ తెరపైకి "పుష్పక విమానం" సినిమా టైటిల్
- July 26, 2016
1987లో కమల్ హాసన్-అమల జంటగా ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూకీ చిత్రం "పుష్పక విమానం" గుర్తుంది కదా. ఆ సినిమా మళ్ళీ తెరమీదకొస్తుందనగానే ఆ సినిమాకి సీక్వెల్ వస్తుందేమో అని ఊహించేసుకోకండి. మళ్ళీ తెరపైకి వస్తున్న విషయం వాస్తవమే కానీ.. సినిమా కాదు, ఆ సినిమా టైటిల్.
విషయం ఏంటంటే.. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి ఓ డిఫరెంట్ మాస్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించనున్నారన్న విషయం తెలిసిందే కదా. రకుల్ ప్రీత్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి "అల్లుడు బంగారం" అనే టైటిల్ కూడా ఫీక్స్ చేసేసినట్లు వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పటివరకూ మాస్ మసాలా టైటిల్స్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన బోయపాటికి ఆ టైటిల్ అంతగా నచ్చలేదు. అందుకే కాస్త డిఫరెంట్ గా "పుష్పక విమానం" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







