కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్‌ మ్యాప్‌..!!

- December 14, 2025 , by Maagulf
కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్‌ మ్యాప్‌..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని మైనింగ్ రంగం ఆశాజనక రంగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. వివిధ గవర్నరేట్‌లలో ఖనిజ వనరులపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ప్రణాళికలను రూపొందించింది. గతంలో ఒమన్ మైనింగ్ డెవలప్‌మెంట్ కంపెనీ సర్వేలలో బంగారం, రాగి, జింక్, సీసం మరియు క్రోమియంతో సహా అనేక వ్యూహాత్మక ఖనిజాల భౌగోళిక ఆధారాలను గుర్తించినట్టు ఒమన్ మైనింగ్ డెవలప్‌మెంట్ కంపెనీ CEO ఇంజనీర్ మతార్ బిన్ సలీం అల్ బాడి తెలిపారు.  

ప్రస్తుతం గుర్తించిన ఖనిజ నిల్వలు ఒమన్ సుల్తానేట్‌లో ఆశాజనకమైన అవకాశాలను ప్రతిబింబిస్తున్నాయని వెల్లడించారు.  అయితే, సర్వే ఫలితాలు ఇంకా సాంకేతిక అధ్యయనాల పరిధిలోనే ఉందని పేర్కొన్నారు.  బంగారంతో సహా వాణిజ్య పరిమాణాల ఉనికికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్వేషణ దశలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పారిశ్రామిక ఖనిజాల విషయానికొస్తే, కంపెనీ పెద్ద ఎత్తున ఉత్పత్తితో నాణ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నట్టు వెల్లడించారు. దేశీయోత్పత్తికి మైనింగ్ రంగం సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కంపెనీ ప్రస్తుతం అనేక వ్యూహాత్మక ప్రాజెక్టులపై పనిచేస్తోందన్నారు. వాటిలో యాంకుల్‌లోని రాగి ప్రాజెక్ట్ అత్యంత ముఖ్యమైనదని ఆయన అన్నారు.

యాంకుల్ రాష్ట్రంలో మొదటి రాగి ఉత్పత్తి ప్రాజెక్టును స్థాపించే పనులు ప్రస్తుతం జరుగుతున్నాని తెలిపారు. 2026 చివరి నాటికి ప్రయోగాత్మక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఇందులో 22.9 మిలియన్ టన్నుల రాగి ధాతువు నిల్వలు ఉన్నట్లు అంచనా వేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com