కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!

- December 14, 2025 , by Maagulf
కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!

రియాద్: సౌదీ అరేబియా కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్ వస్తువులలో 133 రకాల మాదక ద్రవ్యాలు, 632 రకాల నిషేధిత పదార్థాలు, 2,121 రకాల పొగాకు మరియు దాని ఉత్పత్తులు, ఏడు చోట్ల నగదు మరియు ఆరు రకాల ఆయుధాలు, వాటి అనుబంధ వస్తువులు ఉన్నాయని పేర్కొంది.

జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడంలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని అథారిటీ పిలుపునిచ్చింది. స్మగ్లింగ్ నేరాల గురించిన సమాచారాన్ని 1910 నంబర్ కు తెలియజేయాలని కోరింది. సమాచారాన్ని గోప్యంగా పెడతామని, సరైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతిని అందజేస్తామని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com