యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- December 14, 2025
యూఏఈ: యూఏఈలో రాబోయే వారం రోజుల్లో అస్థిర వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని, మార్గదర్శకాలను పాటించాలని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 14న పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బయటికి వెళ్లాలనుకునే కుటుంబాలు వాతావరణానికి తగ్గట్టుగా సిద్ధంగా ఉండాలని, అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అరేబియా గల్ఫ్‌లో మేఘావృతమై కొన్నిసార్లు అల్లకల్లోలంగా మారవచ్చని తెలిపింది.
సోమవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, కొన్నిసార్లు వర్షం పడే అవకాశం ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కు తగ్గుతుందని వెల్లడించింది. ఇక మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని, ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!







