దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!

- December 15, 2025 , by Maagulf
దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!

దోహా: ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జస్సిమ్ అల్-థానీ దర్బ్ అల్ సాయ్ ని  సందర్శించారు. ఈ సందర్భంగా ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం పలు పెవిలియన్‌లను సందర్శించారు. వారసత్వ మరియు సాంస్కృతిక కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ హమద్ అల్-థానీ మరియు పలువురు అధికారులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com