జీతాలు చెల్లించకపోతే న్యాయ సమస్యలు తప్పవు
- July 26, 2016
30 రోజుల్లోగా జీతాలు చెల్లించని కంపెనీలను కోర్టుకు ఈడ్చే దిశగా చర్యలు తీసుకోబడ్తాయని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ మంగళవారం వెల్లడించింది. మంగళవారం ఈ మేరకు ఓ డిక్రీని కూడా విడుదల చేసింది. 100 మందికి పైగా కార్మికులున్న ఏ సంస్థ అయినా ప్రతిపాదిత తేదీని దాటి 10 రోజుల్లోగా జీతాఉaల చెల్లించకపోతే, ఆ సంస్థకు కొత్తగా వర్క్ పర్మిట్లు ఇచ్చే అవకాశం లేదని ఈ డిక్రీ చెబుతోంది. యూఏఈ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ ఘోబాష్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ నుంచి ఈ కొత్త డిక్రీ అమల్లోకి వస్తుంది. నాన్ పేమెంట్ ఘటన సంభవించిన 16 రోజుల తర్వాత కొత్త వర్కర్ పర్మిట్స్ తిరస్కరించబడ్తాయని ఆయన తెలిపారు. సమయపాలన లేకుండా జీతాల్ని చెల్లించడం లేదా బఎగ్గొట్టడం వంటి నేరాలకుగాను అదనంగా పెనాలిటీలు కూడా విధింపబడ్తాయని చట్టం చెబుతోంది. అలాగే, వివిధ సంస్థలతో ఆ సంస్థ జరిపే లావాదేవీల్ని సైతం నిలిపివేయబడుతుంది. 60 రోజుల మించి పెద్ద సంస్థలు జీతాలు చెల్లించకపోతే, అడ్మినిస్ట్రేటివ్ జరీమానాలు కూడా విధింపబడ్తాయి. ప్రతి కార్మికుడికి 5,000 దిర్హామ్‌ల చొప్పున జరీమానా ఉంటుంది. గరిష్టంగా ఈ జరీమానా 50,000 దిర్హామ్‌ల వరకు ఉండొచ్చు. తొలి 30 రోజుల్లో జీతాల్ని చెల్లించేస్తే వర్కర్ పర్మిట్స్పై బ్యాన్ ఎత్తివేయబడుతుంది. 60 రోజులకుపైగా చెల్లింపులకోసం సమయం తీసుకుంటే 60 రోజుల బ్యాన్ కొనసాగుతుంది. రెగ్యులర్‌గా ఇదే రీతిలో జీతాల్ని చెల్లించడం ఆలస్యం చేస్తే చర్యలు డబుల్ అవుతాయి. జీతాల చెల్లింపు ఆలస్యం అనేది సాధారణంగానే జరిగే విషయం అయినప్పటికీ, మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. తద్వారా పారదర్శకత పెరుగుతుందని, కార్మికులకు భద్రత దొరుకుతుందని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







