138 మంది టెర్రర్ అనుమానితులపై విచారణ
- July 26, 2016
బహ్రెయిన్ ప్రాజిక్యూటర్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌ని ప్రారంభించేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడిన అనుమానితులకు వచ్చే నెలలో ట్రయల్ ఉండవచ్చునని తెలిపారు. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్, గల్ఫ్ కింగ్‌డమ్‌కి చెందిన పలువుర్ని కొత్త మొలిటెంట్ గ్రూప్ జుల్ఫికర్ బ్రిగేడ్స్ పేరుతో ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నించింది. దాని పట్ల ఆకర్షితులైన పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జుల్ఫికర్ బ్రిగేడ్స్ వివాదంలో విచారణ పూర్తి అయ్యిందనీ, దాన్ని న్యాయస్థానానికి సమర్పించామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ తెలిపింది. ఇరాన్‌లోని ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే సంస్థలు బహ్రెయిన్‌లో అశాంతిని సృష్టించడానికి విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని బహ్రెయిన్ ఆరోపిస్తోంది. వివిధ నేరారోపణల మీద మొత్తం 138 అనుమానితుల్ని కోర్టుకి ఈ మేరకు రిఫర్ చేశారు. వీరిలో 86 మంది అనుమానితులు కస్టడీలో ఉండగా, మిగతావారంతా ఇరాన్ లేదా ఇరాక్‌కి పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







