హైదరాబాద్ యువతిని పెళ్లాడాలనుకున్న అబు జకారియా..
- July 27, 2016
నగరానికి చెందిన ఓ యువతితో సిరియాకు చెందిన ఇస్లామిక్(ఐస్) ఉగ్రవాద నేతలు సంప్రదింపులు జరిపినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) పేర్కొంది. డిసెంబర్ 2015లో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ఒకరి సోదరిగా ఈ యువతిని గుర్తించారు.
హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర: ప్రధాన సూత్రధారి ఇంగ్లీష్ టీచర్!(పిక్చర్స్)
సిరియాకు చెందిన ఐసిస్ అగ్రనేత అబు జకారియా జిహాదీ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను నడుపుతున్నాడు. దీని ద్వారా హైదరాబాద్‌లో ఉన్న ఐఎస్ సానుభూతిపరులతో గ్రూప్ డిస్కషన్స్ చేసేవాడు.ఈ క్రమంలో భాగంగానే సదరు యువతి సోదరుడితో పాటు ఆమెతో కూడా అతడు మాట్లాడుతుండేవాడు. మ్యాట్రిమోనీ ద్వారా ఐఎస్ ఐడియాలజీని వ్యాప్తి చేసేవాడు. అబు జకారియాతో పాటు మరో వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.కాగా, కేసు విచారణలో భాగంగా విషయం తెలిసిన ఎన్‌ఐఏ అధికారులు యువతిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ అనంతరం విడిచిపెట్టారు. స్థానిక యువతులను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇరుదేశాల మధ్య సులువుగా ప్రయాణించవచ్చనే ఉద్ధేశంతోనే ఉగ్రవాదులు ఇలా వల వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ అధికారులు తెలంగాణ పోలీసుల సాయంతో 11మంది ఐఎస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొందర్ని విచారించి వదిలేసింది. కాగా, ఈ ఉగ్ర సానుభూతిపరులు నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







