ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- December 17, 2025
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ఆదేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ మంగళవారం ప్రధాని మోదీకి అందజేశారు. భారత్-ఇథియోపియా మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక ప్రాత పోశించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
దీంతో ప్రపంచంలో ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ నిలిచారు. భారత్-ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇథియోపియాకు చెందిన ‘గ్రేట్ హానర్ నిషాన్’ అవార్డును ప్రదానం చేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. దీనిని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నాను” అని మోడీ Xలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ (PM Modi) మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకటైన ఈ అవార్డును స్వీకరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, తాను దానిని లోతైన వినయం ,కృతజ్ఞతతో స్వీకరించానని ఆ ప్రకటన పేర్కొన్నారు. ఈ గౌరవానికి గాను ప్రధాని అబియ్, ఇథియోపియా ప్రజలకు ప్రధానమంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







