యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!

- December 18, 2025 , by Maagulf
యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!

యూఏఈ: యూఏఈలో వర్షాలు దంచికొడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల నివాసితులు వడగళ్లు, భారీ వర్షాలు మరియు మేఘావృతమైన ఆకాశంతో నిద్రలేచినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నరు.  దేశంలోని తూర్పు ప్రాంతాలు తెల్లవారుజాము నుండే లోయలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు వర్షాలు తెరిపినియ్యడం లేదని నెటిజన్లు చెబుతున్నారు.   

జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ప్రకారం.. దేశంలోని పలు ప్రాంతాలలో మెరుపులు, ఉరుములు మరియు వడగళ్లతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ అస్థిర వాతావరణం మరో రెండు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది.  

రాస్ అల్ ఖైమాలో, వర్షపాతం మరియు బలమైన గాలుల కారణంగా పలు గోడౌన్లు, షాప్స్ కు నష్టం కలిగినట్లు వాటి యజమానులు తెలిపారు.  వర్షాల కారణంగా ఎమిరేట్ ఆర్థిక అభివృద్ధి అథారిటీ ఇప్పటికే లమ్సత్ వతానియా 2025 ఎగ్జిబిషన్ ప్రారంభాన్ని వాయిదా వేసింది. కొత్త తేదీలను వీలైనంత త్వరగా ప్రకటించనున్నారు.

తెల్లవారుజామున RAKలోని గలీలా లోయ ఉప్పొంగి ప్రవహించడం కనిపించింది.  ఆకాశంలో బూడిద రంగు మేఘాలు కమ్ముకున్నాయి. పర్వతాలతో ఉన్న ఈ ఎమిరేట్‌లో, కార్నిష్ మరియు కోరల్ ఐలాండ్ వంటి నగర ప్రాంతాలలో కూడా బలమైన గాలులతో పాటు వడగళ్లు మరియు భారీ వర్షాలు కురిశాయి.

ఒమన్ సముద్రంలో కఠినమైన పరిస్థితుల నేపథ్యంలో NCM ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో   ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలని,  లోయలు, వరదలు సంభవించే ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని దుబాయ్ పోలీసులు సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com