మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- December 20, 2025
రియాద్: ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన 2025 GovTech మెచ్యూరిటీ ఇండెక్స్ (GTMI)లో సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా అన్ని సూచికలలో రాణించింది. మొత్తం 99.64 శాతం స్కోరుతో "వెరీ అడ్వాన్సుడ్" విభాగంలో నిలిచింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రధాన ప్రభుత్వ వ్యవస్థలు, ఆన్లైన్ సేవా పంపిణీలో మెరుగైన పనితీరును నమోదు చేసింది.
డిజిటల్ గవర్నమెంట్ అథారిటీ (DGA) గవర్నర్ ఇంజనీర్ అహ్మద్ మొహమ్మద్ అల్సువైయన్ మాట్లాడుతూ.. ప్రైవేట్ రంగంతో బలమైన భాగస్వామ్యాలను ఈ ర్యాంకు ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ సేవలను రీ డిజైన్ చేసి, డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని తెలిపారు.
సౌదీ అరేబియా 2020లో మొదటి GTMIలో ప్రపంచవ్యాప్తంగా 49వ స్థానం నుండి 2022లో మూడవ స్థానానికి, 2025లో రెండవ స్థానానికి ఎగబాకి, డిజిటల్ ఆవిష్కరణలలో ప్రపంచ లీడర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







