ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్‌ అరెస్ట్..!!

- December 20, 2025 , by Maagulf
ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్‌ అరెస్ట్..!!

మస్కట్: ముసాందమ్ గవర్నరేట్‌లోని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అధిక వరద ప్రవాహం ఉన్నప్పటికీ సదరు వాహన డ్రైవర్ వరదలున్న వాడిని దాటడానికి ప్రయత్నించాడు.  

ఈ క్రమంలో అతని వాహనం ప్రవాహంలో కొట్టుకుపోయింది.అదృష్టవశాత్తూ, సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) సకాలంలో స్పందించి డ్రైవర్‌ను విజయవంతంగా రక్షించారు.ప్రస్తుతం ఒమన్ లో కురుస్తున్న వర్షాలు కారణంగా వాడీలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అథారిటీ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com