72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- December 20, 2025
దోహా: ఖతార్ లో భారీ వర్షాల కారణంగా నిల్వఉన్న వరద నీటిని తొలగించేందుకు మున్సిపల్, పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఇతర సంస్థలతో కూడిన జాయింట్ రెయిన్ ఎమర్జెన్సీ కమిటీ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించింది.
ఈ సందర్భంగా మొత్తం 72 మిలియన్ గ్యాలన్ల వరద నీటిని తొలగించింది. 544 ట్యాంకర్లు మరియు 36 పంపులను ఉపయోగించి 12,191 ట్రిప్పులలో నీటిని తొలగించారు. వివిధ సంబంధిత ఏజెన్సీల నుండి మొత్తం 813 మంది ఉద్యోగులు, కార్మికులు ఈ ప్రయత్నాలలో పాల్గొన్నారని అథారిటీ తెలిపింది.
మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ కు వరద నీటి లాగ్ లకు సంబంధించిన 1,452 ఫిర్యాదులను అందుకుంది. వర్షాలతో ప్రభావితమైన అన్ని మునిసిపాలిటీలలో ప్రజా సౌకర్యాల భద్రతను నిర్ధారించడానికి నిరంతర పర్యవేక్షణతో సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







