స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- December 22, 2025
న్యూ ఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, సైబర్ నేరాల ముప్పు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రమాదకరమైన స్క్రీన్ షేరింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఎనీడెస్క్, టీమ్ వ్యూయర్, క్విక్ సపోర్ట్ వంటి యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత, ఆర్థిక డేటాను దొంగిలించి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఈ యాప్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకుని బ్యాంకింగ్, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా ఈ స్క్రీన్ షేరింగ్ యాప్స్‌ను టెక్నికల్ సపోర్ట్, ఆఫీస్ వర్క్, ఐటీ సేవల కోసం ఉపయోగిస్తారు.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







