ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ

- December 22, 2025 , by Maagulf
ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ

దోహా: ఖతార్‌లోని పిల్లలు మరియు టీనేజర్లలో విటమిన్ డి లోపం ప్రధాన సమస్యగా ఉందని ఓ స్టడీ పేర్కొందిముఖ్యంగా బాలికల్లో ఈ సమస్య అధికంగా ఉందని ఖతార్ మెడికల్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు.

క్రాస్-సెక్షనల్ రికార్డ్-బేస్డ్ స్టడీ, ఖతార్ పేరిట రూపొందించిన ఈ స్టడీ.. ఒక ఏడాదిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్పొరేషన్ (PHCC) కేంద్రాలకు హాజరైన 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు టీనేజర్లకు సంబంధించి దాదాపు 49,000 ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను విశ్లేషించింది.  

శిశువులు మరియు చిన్న పిల్లలలో తీవ్రమైన విటమిన్ డి లోపం తక్కువగా ఉన్నప్పటికీ, వయస్సుతో పాటు అది పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులలో 3.8% మరియు ఒకటి నుండి నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 3.4% మాత్రమే తీవ్రమైన విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీనికి విరుద్ధంగా, 10 నుండి 17 సంవత్సరాల వయస్సు గల టీనేజర్లలో 40% మందికి తీవ్రమైన విటమిన్ డి లోపం ఉందని తెలిపింది.  బాలురలో 15.3% మందితో పోలిస్తే బాలికల్లో 30.4% మంది ఆ సయస్యతో బాధపడుతున్నారు. కాగా, దక్షిణ ఆసియా నుండి వచ్చిన పిల్లలు ఇతర ప్రాంతాల వారి కంటే చాలా ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని స్టడీ పేర్కొంది.     

ఖతార్‌లో ఎండ వాతావరణం ఉన్నప్పటికీ, పరిమిత బహిరంగ కార్యకలాపాలు, సాంస్కృతిక పద్ధతులు, ఆహారపు అలవాట్లు మరియు ఒబెసిటీ వంటి జీవనశైలి అంశాలు ముఖ్యంగా పెద్ద పిల్లలు మరియు టీనేజర్లలో ఉన్నవారిలో తక్కువ విటమిన్ డి స్థాయిలకు దోహదం చేస్తున్నట్లు వెల్లడించారు.

అయితే, ఎముకల ఆరోగ్యం, ఇమ్యూనిటీకి విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి లోపిస్తే..పిల్లలలో తీవ్రమైన లోపం రికెట్స్, బలహీనమైన ఎముకలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలిపింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com