ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- December 22, 2025
రియాద్: ఆక్స్‌ఫర్డ్ ఇన్‌సైట్స్ రూపొందించిన ప్రభుత్వ AI రెడీనెస్ ఇండెక్స్ 2025లో సౌదీ అరేబియా మిడిలీస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ స్థాయిలో AI అప్లికేషన్‌లను స్వీకరించడం, సేవల్లో భాగస్వామ్యం చేయడంలో సౌదీ వేగవంతమైన పురోగతిని నమోదు చేసిందని పేర్కొన్నారు. పాలన, మౌలిక సదుపాయాల కల్పనలో ఏఐ వినియోగం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు ర్యాంకులు కేటాయించారు.
సౌదీ అరేబియా పాలనలో ప్రపంచవ్యాప్తంగా ఏడవ స్థానంలో మరియు ప్రభుత్వ రంగాల వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవ స్థానంలో నిలిచింది. సౌదీ డేటా మరియు AI అథారిటీ (SDAIA)కి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మరియు SDAIA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నిరంతర మద్దతు ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.
సౌదీ అరేబియా అత్యుత్తమ పనితీరును నివేదిక హైలైట్ చేసింది. ఇందులో HUMAIN వంటి ప్రముఖ జాతీయ ప్లాట్‌ఫారమ్‌ల మద్దతు ఉన్న AI మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. ఇది కంప్యూటింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు AI నమూనాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందని తెలిపింది. ప్రభుత్వ రంగంలో స్మార్ట్ టెక్నాలజీల వినియోగం పెరిగిందని, అదే సమయంలో జాతీయ విధానాలను రూపొందించడంలో AI ని విరివిగా ఉపయోగించుకోవడంలో సౌదీ అరేబియా పురోగతి సాధించిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







