నారి నారి నడుమ మురారి టీజర్‌ రిలీజ్

- December 22, 2025 , by Maagulf
నారి నారి నడుమ మురారి టీజర్‌ రిలీజ్

శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ నారీ నారీ నడుమ మురారి ’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీజర్‌ ను రిలీజ్ చేశారు.

కథ శర్వా పాత్ర చుట్టూ తిరుగుతుంది, అతను ప్రేమలో పడతాడు, తన గర్ల్ ఫ్రెండ్ తండ్రిని వారి వివాహానికి ఒప్పిస్తాడు. అంతా సజావుగా జరుగతున్న సమయంలో, అతని మాజీ ప్రియురాలు అకస్మాత్తుగా ఆఫీస్ లోకి రావడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. తరువాత జరిగే హ్యుమరస్ సంఘటనలు ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న శర్వా పాత్ర..

వినోదాత్మక కథనం ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’ను అందించిన తర్వాత, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను రూపొందించడంలో తన ప్రతిభ నిరూపించుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com