బంగాళాఖాతంలో కొన్ని శకలాలు లభ్యం

- July 27, 2016 , by Maagulf
బంగాళాఖాతంలో కొన్ని శకలాలు  లభ్యం

బంగాళాఖాతంలో కొన్ని శకలాలు కనిపించాయని కాగా అవి అదృశ్యమైన ఏఎన్‌-32 విమానానికి చెందినవి అవునో.. కాదో తేల్చాల్సి వుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 29 మంది రక్షణ సిబ్బందితో తాంబరం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్తున్న ఏఎన్‌-32 విమానం జులై 22న కనిపించకుండా పోయింది. టేకాఫ్‌ అయిన 16 నిమిషాలకే రాడార్‌ నుంచి అదృశ్యమైంది. 'దేని గురించీ కచ్చితమైన నివేదికలు లేవు. కానీ కొన్ని శకలాలు గుర్తించాం. అవి ఏఎన్‌-32 విమానానికి చెందినవా.. కావా నిర్ధారించాల్సిందిగా అధికారుల్ని కోరాం' అని పారికర్‌ తెలిపారు.
అదృశ్యమైన విమానం జాడ కనుక్కునేందుకు భారత నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన 17 నౌకలు, 23 విమానాలు అన్వేషణ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో సాయపడేందుకు మారిషస్‌లోని సాగర్‌ నిధి సంస్థను కోరినట్లు రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com