విద్యార్థులకు వాయిదాల పద్ధతిలో హెచ్ పి ల్యాప్ టాప్ లు
- July 27, 2016
టెక్నాలజీ దిగ్గజం హెచ్ పీ, విద్యార్థులు సులభపద్ధతిలో ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లను కొనుగోలు చేసేలా రుణసౌకర్యాన్ని కల్పిస్తోంది. 'బ్యాక్ టూ కాలేజ్' కార్యక్రమంలో భాగంగా సులభవాయిదా పద్ధతిలో ఈ వెసులుబాటును అందిస్తోంది. ఈ రుణసౌకర్యంలో విద్యార్థులు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సినవసరం ఉండదు. ముందస్తుగా ఎటువంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేకుండా.. 6, 9, 12 నెలల వాయిదాల పద్ధతిలో ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లకు తీసుకున్న రుణాన్ని విద్యార్థులు తిరిగి చెల్లించవచ్చు. సిబిల్ స్కోర్ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ ఈ రుణాన్ని సమకూరుస్తుంది.ఎంపిక చేసిన మోడళ్లపై రూ.11,998 వరకు ప్రయోజనాలను అందుకోవచ్చని... ప్రయోజనాల కింద మూడేళ్ల వరకు వారంటీ, బీమా, బ్లూటూత్ స్పీకర్, హెడ్సెట్, హార్డ్ డిస్క్ వంటివి అందుకోవచ్చని హెచ్ పీ పేర్కొంటోంది. కంప్యూటర్ కొనుగోలు చేయాలని ఉన్నా డబ్బులు లేక ఎంతో మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉంటారని, వారికి ఈ రుణ సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని హెచ్‌పీ ఇండియా కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ కేటగిరీ హెడ్ అనురాగ్ అరోరా తెలిపారు. కమ్యూనికేషన్స్ ప్రతినిధి దినేష్ జోషితో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందుతారని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 500ల పైచిలుకు హెచ్‌పీ విక్రయశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా హెచ్‌పీ పీసీల ప్రారంభ ధర రూ.23 వేలు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







