హను రాఘవపూడి దర్శకత్వం లో నటించనున్న అఖిల్
- July 27, 2016
ఇంతకాలం అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటనేదానిపై అనేక రూమర్లు.. అనేక కథనాలు. వీటన్నిటికీ సమాధానంగా తన కొత్త సినిమా గురించి స్పందించాడు అఖిల్. హను రాఘవపూడి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తికావొచ్చిందని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నందుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానని తెలిపాడు. ప్రాజెక్ట్ పూర్తి డీటైల్స్ త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించాడు.
భారీ హైప్ తో వచ్చిన ఫస్ట్ మూవీ 'అఖిల్' బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డంతో అఖిల్ రెండో సినిమాపై అక్కినేని అభిమానులతోపాటు సినీ అభిమానులందరిలోనూ ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా ఎప్పుడు మొదలౌతుందనే విషయమై అఖిల్ క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ, ఆగష్టు 29 నాగార్జున బర్త్ డే సందర్భంగా అఖిల్ రెండో సినిమా లాంచ్ చేయబోతున్నారన్నది ఇన్ సైడ్ టాక్. నాని హీరోగా 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాతో హిట్ కొట్టి మంచి ఫాంలో ఉన్న డైరెక్టర్ హను రాఘవపూడి అఖిల్ రెండో సినిమాని ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







