సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!

- December 27, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రత 2008 జనవరి 16న హైల్‌లో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ మేరకు సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వివరాలు వెల్లడించింది. 1985 నుండి 2025 వరకు వింటర్ నెలలైన డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరిలో రాజ్యం అంతటా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు మరియు మంచు పరిస్థితులను ఎన్సీఎం సమీక్షించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.
అల్-జౌఫ్ ప్రాంతంలోని ఖురయ్యత్ జనవరి 2008లో మైనస్ 9 డిగ్రీల సెల్సియస్ వద్ద రెండవ అత్యల్ప ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఉత్తర సరిహద్దుల ప్రాంతంలోని తురైఫ్ అదే కాలంలో అనేక సందర్భాల్లో మైనస్ 8 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేయగా, అల్-జౌఫ్ నగరం ఫిబ్రవరి 1989లో మైనస్ 7 డిగ్రీల సెల్సియస్‌ను నమోదు చేసింది. అలాగే, అరార్‌లో మైనస్ 6.3°C, రఫ్హాలో మైనస్ 5.8°C, రియాద్‌లో మైనస్ 5.4°C, బురైదాలో మైనస్ 5°C, ఖాసింలో మైనస్ 4.2°C, తబూక్‌లో మైనస్ 4°C, అల్-అహ్సాలో మైనస్ 2.3°C, వాడి అల్-దవాసిర్‌లో మైనస్ 2°C, తైఫ్‌లో మైనస్ 1.5°C మరియు బిషాలో మైనస్ 1°C ఉన్నాయి.
2008 సంవత్సరం ఇప్పటివరకు నమోదైన అత్యంత వింటర్ సంవత్సరాలలో ఒకటిగా NCM పేర్కొంది. హైల్, రియాద్, బురైదా, ఖాసిం మరియు తబూక్‌తో సహా అనేక నగరాలు ఆ సంవత్సరంలోనే తమ అత్యల్ప ఉష్ణోగ్రతలను చవిచూశాయి. 1985 మరియు 2025 మధ్య నమోదైన మంచు కురిసిన రోజుల సంఖ్య ఆధారంగా ఈ నివేదిక టాప్ 10 నగరాలకు కూడా ర్యాంకులను ఇచ్చింది.

తురైఫ్ 720 మంచు కురిసిన రోజులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఖురయ్యాత్ 588 రోజులతో, హైల్ 339 రోజులతో, అరార్ 277 రోజులతో, రఫ్హా 197 రోజులతో, సకాకా 185 రోజులతో, తబూక్ 139 రోజులతో, బురైదా 83 రోజులతో, అల్-ఖైసుమా 71 రోజులతో మరియు రియాద్ 46 మంచు కురిసిన రోజులతో ఉన్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com