ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- December 27, 2025
అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ (AP) స్త్రీశక్తి ఉచితబస్సు పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీశక్తి బస్సుల్లో పనిచేసే కండక్టర్లకు ఇకపై ఈపోస్ యంత్రాలతో పాటు అదనంగా పవర్ బ్యాంకులు కూడా అందించాలని నిర్ణయించారు. కొన్ని రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. టికెట్లు జారీ చేయడానికే ప్రస్తుతం ఉన్న ఈపోస్ యంత్రాల బ్యాటరీ సామర్థ్యం సరిపోవడం లేదు.
ప్రస్తుతం స్త్రీశక్తి బస్సుల్లో ఉపయోగించే ఈపోస్ యంత్రాల బ్యాటరీ సామర్థ్యం 3,300 ఎంఏహెచ్ మాత్రమే ఉండటంతో, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న బస్సుల్లో టికెట్ల జారీకి మాత్రమే ఛార్జింగ్ సరిపోతోంది.
దీనివల్ల రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో ఉచిత టికెట్లు ఇవ్వడం సాధ్యపడకపోవడంతో కండక్టర్లు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం.
కండక్టర్లకు వినియోగంలో ఉన్న ఈపోస్ యంత్రాలతో పాటు అదనంగా పవర్ బ్యాంకులు అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం టికెట్ల జారీతో పాటు జీపీఎస్ ట్రాకింగ్‌కు ఈపోస్ యంత్రాలను వినియోగిస్తుండటంతో బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. జీపీఎస్ ట్రాకింగ్ నిరంతరం కొనసాగేందుకు 20 వేల ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉన్న మొత్తం 17,880 పవర్ బ్యాంకులను కొనుగోలు చేసి కండక్టర్లకు
అందజేయాలని యాజమాన్యం నిర్ణయించింది.ఈ పవర్ బ్యాంకులను గుంటూరు-11 డిపోలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా, బ్యాటరీ బ్యాకప్ సమర్థవంతంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అన్ని డిపోల్లో స్త్రీశక్తి పథకం అమలవుతున్న బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లకు ఈ పవర్ బ్యాంకులు అందజేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







