ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- December 27, 2025
మస్కట్: చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (SMEలు) మద్దతు ఇవ్వడానికి మస్కట్ మునిసిపాలిటీ “మసార్” చొరవ కింద అల్ మావాలెహ్‌లో ఒక ప్రత్యేక ఫుడ్ ట్రక్ సైట్‌ను ప్రారంభించింది. ఫుడ్ ట్రక్ ఆపరేటర్లకు సరైన స్థలాన్ని అందించడం, వ్యాపార అవకాశాలు మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
మస్కట్ పట్టణ ప్రణాళికను మెరుగుపరచడానికి మునిసిపాలిటీ విస్తృత ప్రయత్నాలలో ఈ చొరవ భాగమని పేర్కొన్నారు. “మసార్” సైట్‌లో మొబైల్ ఫుడ్ విక్రేతల కోసం ప్రత్యేకంగా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సోహార్ ఇంటర్నేషనల్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు. తక్కువ ప్రారంభ ఖర్చులతో ఔత్సాహికులు తమ వ్యాపారాలను ప్రారంభించడానికి వీలుగా స్థలంతోపాటు ఫుడ్ ట్రక్కులను అందజేస్తుందని మునిసిపాలిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







