ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!

- December 27, 2025 , by Maagulf
ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!

రియాద్: ప్రజారోగ్య పర్యవేక్షణను సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రవాస కార్మికుల వైద్య స్క్రీనింగ్ కేంద్రాలు మరియు ఆహార రంగ కార్మిక క్లినిక్‌లలో తనిఖీలను ప్రారంభించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం ఈ తనిఖీల లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల సరైన వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఆరోగ్య ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపింది.

వైద్య స్క్రీనింగ్ కేంద్రాలలో లైసెన్స్ పొందిన వైద్య సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా పనిచేయాలని, అవసరమైన స్పెషాలిటీలలో కనీస సిబ్బంది ఉండాలని మంత్రిత్వశాఖ సూచించింది. లైసెన్స్ పొందిన మరియు చెల్లుబాటు అయ్యే వైద్య పరికరాలు మరియు ఉత్పత్తులను తప్పనిసరిగా ఉపయోగించాలని, అలాగే ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా సెంటర్లు ఏర్పాటు ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఆరోగ్య చట్టాలతో సహా వర్తించే ఆరోగ్య నిబంధనలకు కట్టుబడి ఉన్నారో లేదో తనిఖీల సందర్భంగా అధికారులు గుర్తించనున్నట్లు పేర్కొన్నారు.  937 నెంబర్ ద్వారా ఏవైనా ఆరోగ్య ఉల్లంఘనలను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com