ప్రభాస్ ఫ్యాన్స్ కి రాజాసాబ్ డైరెక్టర్ ఛాలెంజ్..

- December 28, 2025 , by Maagulf
ప్రభాస్ ఫ్యాన్స్ కి రాజాసాబ్ డైరెక్టర్ ఛాలెంజ్..

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9న రిలీజ్ అవుతుండగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా వాయిదా పడటం, టీజర్, ట్రైలర్స్ ఎప్పుడో రిలీజ్ చేసేయడం, గ్లింప్స్ గ్రాఫిక్స్ సరిగ్గా లేవంటూ విమర్శలు రావడం, పాటలు కూడా అంతంత మాత్రం అంటూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవట్లేదు. ఫ్యాన్స్ కూడా ప్రభాస్ మొదటి సారి హారర్ కామెడీ చేస్తున్నాడు అనే ఒకే ఒక పాయింట్ తో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతీ ఎమోషనల్ అయ్యాడు. వీటన్నిటికీ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు మారుతి. సినిమా డిజప్పాయింట్ చేస్తే మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసాడు.

డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా ముంబైలో షూట్ జరుగుతుంటే ఆయన రాముడి గెటప్ లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. వెళ్లి కలిసి ఈ కథ చెప్పి నవ్వించాను. ఆఫ్రికా మసైబారా లో షూట్ కి వెళ్ళా. అక్కడ నేను డైరెక్టర్ అని చెప్పి ప్రభాస్ తో సినిమా చేస్తున్నా అంటే బాహుబలి హీరోనా అని అడిగారు. ఆ దేశంలో వేరే జాతికి కూడా ప్రభాస్ అంటే తెలుసు. ఒక మీడియం హీరోని బాహుబలి తో పాన్ ఇండియా పెద్ద కటౌట్ లా నిలబెట్టారు రాజమౌళి. ఆయనకు అందరూ రుణపడి ఉంటారు. ఈ సినిమా మూడేళ్లు కష్టపడి తీసాము. ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడైనా ఒక్క శాతం అయినా డిజప్పాయిట్ చేస్తే మా ఇంటి అడ్రెస్ పెడతా ఇంటికి రండి. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎవరికైనా రాజాసాబ్ చూసి డిజప్పాయింట్ అయితే కొల్ల లగ్జోరియా, విల్లా నెంబర్ 17, కొండాపూర్ లో ఉంటుంది మా ఇల్లు. అక్కడికి రండి అని డైరెక్ట్ ఛాలెంజ్ ఇచ్చాడు.

ప్రభాస్ కూడా సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com