జబల్ అఖ్దర్‌లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!

- December 29, 2025 , by Maagulf
జబల్ అఖ్దర్‌లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!

జబల్ అఖ్దర్: అల్ దఖిలియా గవర్నరేట్ లో OMR9 మిలియన్ల అంచనా వ్యయంతో అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టులను చేపట్టారు. జబల్ అఖ్దర్ విలాయత్ లో ఈ ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలు, పర్యాటక ఆకర్షణలు మెరుగుపడనున్నాయి.  అల్ జబల్ అల్ అఖ్దర్‌లో ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని అల్ జబల్ అల్ అఖ్దర్‌కు చెందిన అధికార ప్రతినిధి వాలి షేక్ సుల్తాన్ మన్సూర్ అల్ గఫిలి తెలిపారు. అనేక రోడ్ల ప్రాజెక్టులు అమలవుతున్నాయని, ఇవి రోడ్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. 

జీవన నాణ్యతను పెంచేలా పట్టణ గ్రీన్ స్పేస్‌గా పనిచేసే అల్ జబల్ అల్ అఖ్దర్ పార్క్ మరియు సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్ స్క్వేర్ ప్రాజెక్ట్‌తో సహా అనేక కమ్యూనిటీ ప్రాజెక్టుల పనులు శరవేగంతో కొనసాగుతున్నాయని తెలిపారు. హాయ్ల్ అల్ యమన్ ప్రాంతంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ వాణిజ్య సముదాయ ప్రాజెక్ట్ వస్తుందని, ఈ కాంప్లెక్స్‌లో త్రీ-స్టార్ హోటల్, ఎడ్యుకేషన్ హబ్, కమర్షియల్ మార్కెట్ ఉంటాయన్నారు. ఇది సందర్శకులకు అందించే పర్యాటక మరియు వినోద సేవలను వైవిధ్యపరచడానికి దోహదపడుతుందని వెల్లడించారు.

అలాగే, సీహ్ ఖతానా ప్రాంతంలో 3D ఓపెన్-ఎయిర్ అరీనా మరియు డాన్ అల్-బుసైటైన్ పార్క్ కూడా వస్తున్నాయని అన్నారు.  ఇవన్నీ రాబోయే రోజుల్లో ఒమన్ సుల్తానేట్‌లో ప్రముఖ పర్యాటక మరియు అభివృద్ధి గమ్యస్థానంగా అల్ జబల్ అల్ అఖ్దర్ స్థానాన్ని బలపరుస్తుందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com