రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- December 29, 2025
రియాద్: రియాద్‌లోని వివిధ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులను రియాద్ ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ ప్రారంభించారు. అల్-హుక్మ్ ప్యాలెస్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రియాద్ మేయర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ కొత్త పార్కులు జీవన నాణ్యత, పట్టణ రూపురేఖలను మెరుగుపరచడానికి మరియు రియాద్ నివాసితులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి దోహదపడే ఒక విలువైన అదనపు సంపద అని ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ అన్నారు.
మొత్తం 274,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కొత్త పార్కులలో 77,300 చదరపు మీటర్ల గ్రీనరీ, 2,480 చెట్లు, 33,500 లీనియర్ మీటర్ల పాదచారుల నడక మార్గాలు మరియు 7,400 లీనియర్ మీటర్ల సైకిల్ మార్గాలు ఉన్నాయి. ఇక 17 క్రీడా మైదానాలు, 913 పార్కింగ్ స్థలాలు మరియు 12,000 చదరపు మీటర్ల పిల్లల ఆట స్థలాలు ఉన్నాయని వివరించారు. రియాద్ నగరంలో 2022లో 17 పార్కులు, 2023లో 45 పార్కులు, 2024లో 25 పార్కులను ప్రారంభించగా.. తాజాగా మరో 25 కొత్త పార్కులను ప్రారంభించారు.
తాజా వార్తలు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!







