ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!

- December 29, 2025 , by Maagulf
ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!

చిన్నతనంలో లేదా అనుకోకుండా వింత వింత పేర్లతో క్రియేట్ చేసిన జీమెయిల్ అడ్రస్‌లు ప్రొఫెషనల్ అవసరాల కోసం చెప్పడంలో ఇబ్బంది కలిగించవచ్చు. ఇప్పటివరకు, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేసి, డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ, గూగుల్ త్వరలో జీమెయిల్ అడ్రస్ మార్చుకునే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. గూగుల్ హిందీ సపోర్ట్ పేజీలో ఈ ఫీచర్ వివరాలు ఇప్పటికే లభిస్తున్నాయి, మరియు అది త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరనుంది.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
1.డేటా భద్రత: మీరు పాత ‘@gmail.com’ అడ్రస్ మార్చిన తర్వాత కూడా, పాత ఈమెయిల్స్, ఫోటోలు, డ్రైవ్ ఫైల్స్ వంటి డేటా ఏవీ డిలీట్ అవ్వవు.
2.అలియాస్ (Alias): కొత్త అడ్రస్ సెటప్ చేసిన తర్వాత పాత అడ్రస్ ఒక అలియాస్‌గా పనిచేస్తుంది. అంటే, ఎవరైనా పాత ఐడీకి మెయిల్ పంపితే అది కొత్త ఐడీ ఇన్‌బాక్స్‌లోకి రాబోతుంది.
3.లాగిన్ సౌకర్యం: మీరు పాత ఐడీ లేదా కొత్త ఐడీతో ఏదైనా లాగిన్ అవ్వవచ్చు.

ముఖ్యమైన నియమాలు
1.ఏడాదికి ఒకసారి మాత్రమే: ఒక అకౌంట్ 12 నెలల్లో ఒక్కసారి మాత్రమే అడ్రస్ మార్చుకోవచ్చు.
2.లైఫ్ టైమ్ లిమిట్: ప్రతి అకౌంట్‌కు గరిష్టంగా 4 అడ్రస్‌లు (1 ఒరిజినల్ + 3 మార్పులు) మాత్రమే ఉండగలవు.
3.పాత ఐడీ భద్రత: వదిలిన పాత అడ్రస్‌ను మరెవరు పొందలేరు; అది శాశ్వతంగా మీ అకౌంట్‌కు లింక్ అవుతుంది.
4.వెయిటింగ్ పీరియడ్: కొత్త అడ్రస్ సెటప్ చేసిన 12 నెలలలో మళ్ళీ మార్చడం లేదా డిలీట్ చేయడం సాధ్యం కాదు.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ప్రస్తుతం ఈ ఫీచర్ గ్రాడ్యువల్ రోలౌట్ విధానం ప్రకారం దశలవారీగా అందించబడుతోంది. 2026 ప్రారంభానికి పూర్తి స్థాయిలో జీమెయిల్ సెట్టింగ్స్‌లో అందుబాటులోకి రావచ్చని అంచనా.

జీమెయిల్ అడ్రస్ ఎలా మార్చాలి?
1.గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ (myaccount.google.com) కు వెళ్లండి.
2.Personal Info ట్యాబ్ పై క్లిక్ చేయండి.
3.Contact Info విభాగంలో Email పై క్లిక్ చేయండి.
4.Google Account Email ఆప్షన్ దగ్గర ఎడిట్ లేదా చేంజ్ బటన్ కనిపిస్తే, కొత్త యూజర్‌నేమ్ ఇవ్వండి మరియు వెరిఫై చేయండి.
ఈ విధంగా, కొత్త అడ్రస్ సెటప్ చేసి, పాత అడ్రస్‌ను అలియాస్‌గా ఉపయోగించడం ద్వారా ప్రొఫెషనల్ అవసరాలకు తగిన గమ్యం సాధించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com