'తేనె' చర్మాన్ని కాపాడుతుంది
- July 19, 2015
తేనె సహజ యాంటీఆక్సిడెంట్గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది. చెంచా తేనెలో రెండు చెంచాల బాదంనూనె, అరచెంచా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట తరవాత కడిగేయాలి.తేనె, నిమ్మరసం మిశ్రమం మొటిమలను తగ్గిస్తుంది. రెండు చెంచాల తేనెకి చెంచా నిమ్మరసం చేర్చి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే మొటిమల సమస్య ఉండదు.రెండు చెంచాల తేనెకి చెంచా ముల్తానీ మట్టిని కలిపి ముఖానికి రాసి పావుగంట తరవాత శుభ్రం చేయాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది. చెంచా తేనె, రెండు చెంచాల చొప్పున పాలూ, కీరదోస గుజ్జూ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చెంచా తేనెకి రెండు చెంచాల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరవాత చన్నీళ్లతో శుభ్రం చేస్తే చర్మానికి నిగారింపు వస్తుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







