తొమ్మిదేళ్ళ తర్వాత స్వదేశానికి వలసదారుడి పయనం
- July 27, 2016
భారతీయ వలసదారుడు, తొమ్మిదేళ్ళ తర్వాత లీగల్ ఇబ్బందుల్ని దాటుకుని, స్వదేశానికి పయనమయ్యాడు. పి నాయర్ అనే వ్యక్తి కేరళ నుంచి వలస వచ్చాడు. అయితే బ్యాంకు లోన్లను తిరిగి చెల్లించలేకపోవడం, క్రెడిట్ కార్డు బిల్లుల్ని చెల్లించకపోవడం సహా సరైన రెసిడెన్స్ పర్మిట్ లేకపోవడం వంటి కేసుల్లో ఇరుక్కుని, స్వదేశానికి వెళ్ళలేక తొమ్మిదేళ్ళుగా ఇబ్బందులు పడ్డాడు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నాయర్‌కి ఖతార్ ఛారిటీ ఆర్థిక సహాయాన్ని అందించింది. 2014 రమదాన్ సమయంలో బ్యాంకు ఇచ్చిన ఆఫర్‌తో 75000 ఖతార్ రియాల్స్ చెల్లించాల్సి ఉన్న నాయర్, 25,000 ఖతారీ రియాల్స్ సింగిల్ పేమెంట్‌లో చెల్లించి సెటిల్ చేసుకున్నాడు. ఇండియాకి చెందిన రవి పిల్లయ్ అనే ఇండస్ట్రియలిస్ట్ సమా పలువురు నాయర్‌ని అన్ని విధాలా ఆదుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కూడా అతనికి కేసుల నుంచి ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో, నాయర్ స్వదేశానికి వెళ్ళేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇండియాకి వెళుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని నాయర్ చెమర్చిన కళ్ళతో చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







