వచ్చే వారం పాకిస్థాన్‌లో పర్యటించనున్నా రాజ్‌నాథ్‌సింగ్
- July 27, 2016
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వచ్చే వారం పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో పాక్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సమావేశాలకు రాజ్‌నాథ్ హాజరుకానున్నారు. ఇటీవల కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌నాథ్ పాక్ పర్యటన ఉత్కంఠను రెకెత్తిస్తోంది.
ఉగ్రవాద సంస్థ హిబ్జుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీని భారత భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కశ్మీర్ లోయ కల్లోలంగా మారింది. ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన పాక్ ప్రభుత్వం భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. స్వయానా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా.. పాక్ నేతలు బుర్హాన్ వానీని స్వాతంత్య్ర సమరయోధుడితో పోల్చడంతో ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయలకు తెరతీసినట్లయింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







