ఓం శాంతి శాంతి శాంతిః నుంచి సిన్నారి కోన సాంగ్ రిలీజ్
- December 30, 2025
ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ.
ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ సిన్నారి కోన సాంగ్ ని రిలీజ్ చేసిన మ్యుజికల్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. అప్పగింతలు బ్యాక్ డ్రాప్ లో కంపోజర్ జయ కృష్ణ ఈ సాంగ్ బ్యూటీఫుల్ మెలోడీగా స్వరపరిచారు. జయ కృష్ణ, అనన్య భట్, ఎం.జి. నరసింహ వోకల్స్ పాటకు ఫీల్ ని తీసుకొచ్చాయి. భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సాంగ్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కెమిస్ట్రీని ప్రజెంట్ చేసిన తీరు ఆసక్తికరంగా వుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కొత్తగా పెళ్లైన జంటగా విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ, వారి మధ్య భావోద్వేగాలను సహజంగా పలికించారు. ముఖ్యంగా ఈషా రెబ్బా, కొత్త ఇంటికి అలవాటు పడుతున్న నవ వధువు పాత్రలో కనిపించే నాజూకుతనం, భావోద్వేగాలను ఎంతో అందంగా ప్రదర్శించారు. వినగానే ఆకట్టుకునే ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రానికి దీపక్ డీవోపీగా పని చేస్తున్నారు. నంద కిషోర్ ఈమాని డైలాగ్స్ రాస్తున్నారు.
ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 23న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అప్పాజీ), బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - ఎ ఆర్ సజీవ్
నిర్మాతలు - సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి
బ్యానర్- S ఒరిజినల్స్ & మూవీ వెర్స్ స్టూడియోస్
సహ నిర్మాతలు: కిషోర్ జాలాది, బాల సౌమిత్రి
సంగీతం - జై క్రిష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - దీపక్ యెరగరా
డైలాగ్స్ - నంద కిషోర్ ఈమాని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -భువన్ సాలూరు
లైన్ ప్రొడ్యూసర్ - శ్రీనివాసరావు ఈర్ల
PRO - వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







