'నీ జతలేక' పాటల విజయోత్సవం ..
- July 27, 2016
నా గశౌర్య, పారుల్, సరయు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'నీ జతలేక'. లారెన్స్ దాసరి దర్శకుడు. జి.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్ చిర్రా నిర్మాతలు. ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పకులు. స్వరాజ్ సంగీతమందించారు. బుధవారం హైదరాబాద్‌లో పాటల విజయోత్సవం జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ''మూడు మనసుల నేపథ్యంలో సాగే ముక్కోణపు ప్రేమాయణమిది. స్వరాజ్ సంగీతం బాగా కుదిరింది. చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంద''న్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ''నమ్మకంతో చేసిన చిత్రమిది. బుజ్జి ఛాయాగ్రహణం, స్వరాజ్ సమకూర్చిన పాటలు బాగుంటాయి. దర్శకుడు లారెన్స్ దాసరితో కలిసి పనిచేయడం మంచి అనుభవం. ఈ సినిమా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాన''న్నారు. ''పాటల్లాగే సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుందనే నమ్మకముంద''న్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సరయు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రామ్ పైడిశెట్టి తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







