ఫస్ట్ ఎవర్ గోట్ ఫైట్ మూవీ జాకీ టీజర్ విడుదల చేసిన విజయ్ సేతుపతి
- January 04, 2026
PK7 స్టూడియోస్ నిర్మిస్తున్న కొత్త తమిళ సినిమా ‘జాకీ (Jockey)’ టీజర్ విడుదలైంది. ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చెన్నైలో జరిగిన వీధి తిరువిళా – 13వ ఎడిషన్ కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేశారు.
2021లో వచ్చిన ‘మడ్డి’ సినిమా తర్వాత, PK7 స్టూడియోస్ మరోసారి దర్శకుడు డా. ప్రగభల్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.ప్రేమ కృష్ణదాస్ - సి దేవదాస్ & జయ దేవదాస్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో యువన్ కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు. శక్తి బాలాజీ ఈ సినిమా కి సంగీతం అందించారు.
మధురై నేపథ్యంలో సాగే ‘జాకీ’ కథ గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ పోరాట సన్నివేశాలు అన్ని సహజం గా తెరకెక్కించడానికి ఒక మూడు సంవత్సరాలు ఆ ప్రాంతంలో సినీ బృందము చాలా కృషి చేసి నేటివిటీ మిస్ అవ్వకుండా ఈ సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు.
నటీనటులు నిజమైన పొట్టేలుతో శిక్షణ తీసుకొని నటించారు.
‘జాకీ’ సినిమా ద్వారా గ్రామీణ జీవితం, ప్రజల భావోద్వేగాలు, సంప్రదాయ క్రీడను సహజంగా ప్రేక్షకులకు చూపించనున్నారు.టీజర్ విడుదలతో ఈ సినిమా ప్రయాణం మొదలైంది. మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక
- సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!







