బని హజర్ ఇంటర్చేంజ్ తాత్కాలికంగా మూసివేత..!!
- January 05, 2026
దోహా: బని హజర్ ఇంటర్చేంజ్ వద్ద అల్ షహామా స్ట్రీట్ నుండి దుఖాన్ వైపు వచ్చే ట్రాఫిక్ కోసం మరియు ఖలీఫా స్ట్రీట్ నుండి అల్ షహామా స్ట్రీట్ వైపు వచ్చే ట్రాఫిక్ కోసం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సమన్వయంతో జనవరి 9న శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ప్రారంభమవుతుందని వెల్లడించారు.
మూసివేత సమయంలో దోహా నుండి ఖలీఫా స్ట్రీట్ మీదుగా బని హజర్ వైపు ప్రయాణించే వాహనదారులు న్యూ అల్ రేయాన్ స్ట్రీట్‌కు దారితీసే వంతెనను ఉపయోగించాలని, ఆపై అల్ షాఫీ ఇంటర్చేంజ్ వద్ద యు-టర్న్ తీసుకొని, ఆపై బని హజర్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్‌ను ఉపయోగించాలని అధికారులు సూచించారు. అలాగే, అల్ షహామా స్ట్రీట్ నుండి దుఖాన్ వైపు ప్రయాణించే వాహనదారులు బని హాజర్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ గుండా కొనసాగాలని, ఆపై న్యూ అల్ రేయాన్ స్ట్రీట్‌లోని అల్ షాఫీ ఇంటర్‌చేంజ్‌ను ఉపయోగించి యు-టర్న్ తీసుకొని దుఖాన్ వైపు కొనసాగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







