BD200,000 దాటిన లాభాలపై 10% కార్పొరేట్ ట్యాక్స్..!!
- January 06, 2026
మనామాః బహ్రెయిన్ పార్లమెంటుకు ఆర్థిక మరియు ఆర్థిక వ్యవహారాల కమిటీ పంపిన ముసాయిదా చట్టం ప్రకారం.. BD200,000 కంటే ఎక్కువ లాభాలపై పది శాతం కార్పొరేట్ పన్ను వర్తించనుంది. ఒక ట్యాక్స్ ఇయర్ లో ఆదాయం BD1 మిలియన్ మించినప్పుడు లేదా ట్యాక్స్ విధించదగిన ఆదాయం BD200,000 మించినప్పుడు ప్రధాన ట్యాక్స్ నిబంధనలు వర్తిస్తాయి. BD200,000 వరకు ఉన్న ట్యాక్స్ విధించదగిన ఆదాయంపై 0 శాతం మరియు దాని కంటే ఎక్కువ ఉన్న ఆదాయంపై 10 శాతం ట్యాక్స్ ను ప్రతిపాదించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే డివిడెండ్లపై 0 శాతం, వడ్డీపై 5 శాతం (లేదా వడ్డీని ప్రభుత్వ సంస్థ చెల్లిస్తే 0 శాతం), రాయల్టీలపై 5 శాతం మరియు సేవలపై 5 శాతం పన్ను విధించబడుతుంది.
ఇక ప్రధాన ట్యాక్స్ విధింపు నిబంధనల కింద ఉద్యోగ ఆదాయం మరియు వ్యక్తిగత రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఆదాయం పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించరు. అలాగే, ప్రభుత్వ సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ పెట్టుబడి నిధులు, పెన్షన్ అమౌంట్ మరియు అంతర్జాతీయ సంస్థలకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







