దిచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్..
- July 28, 2016
జాతీయ రహదారులపై దిచక్ర వాహనాలు నడిపే వారు ఇకనుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. లేకపోతే జరిమానాతో పాటు పోలీసు కేసులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గురువారం నుంచి హైవేలపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు అర్బన్ ఎస్పీ త్రిపాఠి బుధవారం తెలిపారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. తనిఖీ సందర్భంగా హెల్మెట్ లేకుండా పట్టుపడితే పెద్ద మొత్తంలో జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ తప్పనిసరి చేశామన్నారు. ప్రమాదాల్లో తలకు గాయాలై మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. శరీరంలో తలభాగం ఎంతో ముఖ్యమైనదని, దీనిని దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహన చోదకులు తప్పని సరిగా హెల్మెట్‌ను ధరించాలని సూచించారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







