'రజనీకాంత్‌కు 'భారతరత్న' ఇవ్వాలని కోరిన బీజేపీ ఎమ్మెల్యే

- July 28, 2016 , by Maagulf
'రజనీకాంత్‌కు 'భారతరత్న' ఇవ్వాలని కోరిన బీజేపీ ఎమ్మెల్యే

భారత అత్యుత్తమ పురస్కారమైన 'భారతరత్న'ను దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఇవ్వాలట. ఈ డిమాండ్‌ చేసింది ఆయనంటే పడిచచ్చే ఓ వీరాభిమాని కాదు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అనిల్‌ గోటే. ఆయన కేవలం ఈ డిమండ్‌ చేసి ఊరుకోలేదు. రజనీకాంత్‌కు 'భారతరత్న' ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. పనిలోపనిగా 'మహారాష్ట్ర భూషణ్‌' అవార్డు కూడా రజనీకి ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు. రజనీకాంత్‌ మహారాష్ట్ర 'భూమిపుత్రుడ'ని, ఆయనకు అన్ని అవార్డులూ అందుకునే అర్హత ఉందని అనిల్‌ అన్నారు. అభిమానులకు రజనీ దేవుడితో సమానమని, తాజా సినిమా విజయమే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. రజనీకాంత్‌ను గౌరవించుకోవాల్సిన అవసరం మహారాష్ట్రకు, అలాగే కేంద్రానికీ ఉందని ఆయన వెల్లడించారు. రజనీకాంత్‌ పుట్టింది మహారాష్ట్రలో అనే విషయం తెలిసిందే. అక్కడ నుంచి కర్ణాటకకు మారి, ఆపై మద్రాస్‌ వచ్చి సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com