‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
- January 09, 2026
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ సినిమాకి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ (TG) రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు స్పెషల్ జీవో జారీ చేసింది. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 18 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంపునకు వెసులుబాటు కల్పించింది. జీఎస్టీతో కలుపుకొని ఈ ధరలు ఉండబోతున్నాయి. పది రోజుల పాటు ఈ స్పెషల్ రేట్లు అమల్లో ఉంటాయి.
టికెట్ హైక్స్ ద్వారా వచ్చిన లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్ అకౌంట్ లోకి వెళ్తుందని ఆదేశాలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.హారర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







