ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- January 09, 2026
యూఏఈ: ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాసింజర్ సేవలను ప్రారంభించడానికి ఇతిహాద్ రైల్ సిద్ధమవుతున్నది. యూఏఈ మొదటి జాతీయ రైల్వే నెట్వర్క్.. నగరాలను అనుసంధానించడంతోపాటు దేశంలో దాగి ఉన్న చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ప్రజలకు ఒక కొత్త రూట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ ప్యాసింజర్ రైలు నెట్వర్క్ యూఏఈ వ్యాప్తంగా 11 స్టేషన్లను కలుపుతుంది. ఇది సౌదీ సరిహద్దు సమీపంలోని అల్ సిలా నుండి షార్జాలోని అల్ ధైద్ వరకు, అబుదాబి పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు తీరంలోని ఫుజైరా వరకు నిర్మించారు. ఈ రైల్ నెట్ వర్క్ ఎడారి పట్టణాలు, తీరప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు మరియు చారిత్రక కట్టడాల గుండా వెళుతుంది . గతంలో ప్రకటించిన నాలుగు స్టేషన్లతో పాటు ఏడు కొత్త స్టేషన్లను తాజాగా ఆవిష్కరించారు.
అబుదాబిలోని అల్ ధఫ్రా ప్రాంతంలో ఉన్న అల్ సిలా, అల్ ధన్నా, అల్ మిర్ఫా, మదీనత్ జాయెద్, మెజైరా, అబుదాబి, అల్ ఫయా, దుబాయ్, యూనివర్సిటీ సిటీ, అల్ ధైద్, సకమ్కామ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







