ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- January 11, 2026
మస్కట్: ఒమన్‌లోని ఒక కోర్టు అల్లర్లు, విధ్వంసం, రెచ్చగొట్టడం మరియు ప్రజా శాంతికి హాని కలిగించే విషయాలను ప్రచారం చేసిన ఆరోపణలపై 59 మంది ప్రవాసులను దోషులుగా నిర్ధారించి, వారికి జైలు శిక్ష, శాశ్వత బహిష్కరణ మరియు వారి మొబైల్ ఫోన్‌లను జప్తు చేయాలని తీర్పు ఇచ్చింది. బిద్బిద్ విలాయత్‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు జనవరి 8న ఈ తీర్పును వెలువరించింది.
నిందితులు రెచ్చగొట్టడంతోపాటు చట్టవిరుద్ధంగా సమావేశంలో పాల్గొన్నారని, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని, ప్రజా శాంతికి భంగం కలిగించే కంటెంట్‌ను సృష్టించారని.. సమాచార సాంకేతికతను ఉపయోగించడం వంటి అనేక నేరాలకు పాల్పడినట్లు దోషులుగా తేల్చింది కోర్టు. మరో 23 మంది నిర్దోషులుగా పేర్కొని విడుదల చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసు డిసెంబర్ 25 సాయంత్రం చోటుచేసుకుంది. ఆ రోజు బిద్బిద్ విలాయత్‌లోని సా'అల్ ప్రాంతంలో ఒక కంపెనీకి చెందిన నివాస సముదాయం సమీపంలో విధ్వంసం మరియు రెచ్చగొట్టే చర్యలతో ఒక గుంపు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కార్మికుల పెద్ద గుంపు కంపెనీ సౌకర్యాలు మరియు ఆస్తులపై విధ్వంసక చర్యలకు పాల్పడటాన్ని, అలాగే కంపెనీ బస్సులను ధ్వంసం చేయడాన్ని అడ్డుకుని, వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు
- NDWBFలో ఖతార్.. భారత్ తో బలమైన సంబంధాలు..!!
- ఇరాన్ పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!
- థర్డ్ పార్టీలతో ఓవర్‌నైట్ క్యాష్ స్టోరేజ్ ఆపాలన్న సెంట్రల్ బ్యాంక్..!!







