సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- January 11, 2026
రియాద్ః సౌదీ భద్రతా అధికారులు గత వారం రోజుల్లో మొత్తం 18,836 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. జనవరి 1 నుండి 7వ తేదీ మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి భద్రతా దళాలు సంయుక్త తనిఖీలు చేపట్టారని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టు అయిన వారిలో 11,710 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు, 4,239 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు మరియు 2,887 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారు. మొత్తం 20,956 మంది ఉల్లంఘనదారులను ప్రయాణ పత్రాల కోసం వారి దౌత్య కార్యాలయాలకు అప్పగించగా, 5,201 మందిని వారి ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేయడానికి పంపారు. 10,195 మంది ఉల్లంఘనదారులను దేశం నుండి బహిష్కరించారు.
అలాగే, రాజ్యంలోకి సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తూ 1,741 మంది పట్టుబడ్డారు. వీరిలో 39 శాతం యెమెన్ జాతీయులు, 60 శాతం ఇథియోపియన్ జాతీయులు మరియు ఒక శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. సౌదీని అక్రమంగా విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున 46 మందిని అరెస్టు చేశారు. అక్రమార్కులకు సాయం చేసిన 19మందిని కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. ఉల్లంఘనలకు పాల్పడే వారికి సాయం చేసిన వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా విధిస్తామని మంత్రిత్వశాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్‌కు, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు ఫోన్ చేసి ఏవైనా ఉల్లంఘనల కేసులును తెలియజేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు
- NDWBFలో ఖతార్.. భారత్ తో బలమైన సంబంధాలు..!!
- ఇరాన్ పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్కు అధికారుల బ్రీఫింగ్!
- థర్డ్ పార్టీలతో ఓవర్నైట్ క్యాష్ స్టోరేజ్ ఆపాలన్న సెంట్రల్ బ్యాంక్..!!







