తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- January 09, 2026
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం జనవరి 10, 2026న ఉత్తర శ్రీలంక తీరాన్ని ట్రింకోమలీ, జాఫ్నాల మధ్య మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణంతోపాటు చలి తీవ్రత ఉంటుందని, అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







