తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- January 09, 2026
హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టింది. జనవరి 7 నుంచి ఇప్పటి వరకు 75 ప్రైవేట్ బస్సుల పై నిబంధనల ఉల్లంఘనలకుగాను కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల పూర్తి జాబితా నిర్వహించకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి మౌలిక భద్రతా సదుపాయాలు లేకపోవడం వంటి పలు లోపాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎనిమిది బృందాలు బస్సు డిపోలు, ప్రధాన రహదారులు, బస్టాండ్ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పండుగ సమయంలో ప్రయాణించే ప్రజల భద్రతకు ఎలాంటి రాజీ ఉండదని రవాణా శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే బస్సులపై జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైతే అనుమతులు రద్దు చేసే చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







