సాయిధర్మ్ తేజ్ కు ధనుష్, శింభు ల సాంగ్స్
- July 28, 2016
ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తమిళ స్టార్ హీరోలు ధనుష్ మరియు శింభు లు కలసి ఒకే సినిమాకి పాట పాడటం అనేది ఇదే మెట్టమెదటి సారి, అది కూడా తెలుగులో పాడటం విశేషం.. టాలీవుడ్ సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కోసం వీరిద్దరూ పాడటం చెరోక పాట పాడారు. వీరిద్దరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ. తమన్ స్వరపరచిన తిక్క చిత్రంలోని సాంగ్స్ ని ఫుల్ జోష్ తో పాడారు. 'తిక్క. తిక్క' అంటూ సాగే ఈ సాంగ్ ని ధనుష్ పాడగా.. 'హీ ఈజ్ హట్ షాట్' హీరో అనే లిరిక్ తో సాగే సాంగ్ ని శింభు పాడటం తో తిక్క చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మెగా అభిమానులతో పాటు, సామాన్య సిని ప్రేక్షకుల వరకూ అందరూ ఈ ఆడియో ని ఎప్పుడు విందామా అని వెయిట్ చేయటం విశేషం గా చెప్పుకోవాలి. ఈ మద్యకాలంలో ఇంతలా ఏ ఆడియోకి క్రేజ్ వచ్చివుండదు. ఈ ఆడియోని ఈ నెల 30 న మెగాఅభిమానుల సమక్షంలో విశిష్ట అతిధుల చేతులమీదుగా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత డాక్టర్.సి.రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ లో చిత్ర నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. సుప్రీమ్ హీరో సాయిధర్మ్ తేజ్ హీరోగా నిర్మిస్తున్నతిక్క చిత్రం కొసం కూడా ఏవిధంగా కూడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేశాము. అలాగే థమన్ అందించిన మా ఆడియోని కి కూడా తమిళ సూపర్‌స్టార్స్ ధనుష్, శింభు ల చేత సాంగ్స్ పాడించాము. వారు ఎంతగానో బిబిగా వున్నా కూడా మా మాట కాదనకుండా కంటెంట్ నచ్చి సాంగ్ రికార్డు చేశారు, వారిద్దరూ మా చిత్రానికి సాంగ్ పాడటంతో మా తిక్క చిత్రానికి క్రేజ్ విపరీతమైన వచ్చింది. అందరి అంచనాలని అందుకునే లా మా ఆడియో వుంటుంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రేంజ్ కు తగ్గట్టుగా లావిష్ గా చిత్రాన్ని నిర్మించాం. పాటల చిత్రీకరణ కూడా లావిష్ గా చేశాము. పాజిటివ్ వైబ్రేషన్స్ తో షూటింగ్ పూర్తిచేసుకున్న తిక్క ఆడియో ని 30న సర్ప్రైజింగ్ గెస్ట్ ల సమక్షంలో విడుదల చేస్తాము. టోటల్ గా ప్రాజెక్ట్ కు ఇంప్రెస్ అయి ధనుష్, శింభు పాట పాడారు. అంతే కాదు తెలుగులో వీరిద్దిరికి ఒకే హీరోకు పాట పాడటం కూడా ఫస్ట్ టైం కావడం విశేషం.తమన్ ప్రతి సాంగ్‌ని ప్రత్యేక శ్రద్ధతో సాయి ధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ ను, ఆయన చేసే డ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని కంపోజ్ చేశారు. ధనుష్, శింభు లు ఈ పాటలు పాడినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆగస్ట్ 13న గ్రాండ్ గా తిక్క చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు.
నటీనటులు.. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, లరిస్సా బోన్సి, మన్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ఆలి, సప్తగిరి, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, అజయ్, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, సత్య, ఆనంద్, వి.జే.భాని, కామ్నా సింగ్ నటించగా..
టెక్నిషియన్స్.. నిర్మాత- డాక్టర్.సి.రోహిన్ రెడ్డి, దర్శకత్వం- సునీల్ రెడ్డి, సహనిర్మాత-కిరణ్ రంగినేని, కెమెరా- కె.వి.గుహన్ సంగీతం- ఎస్.ఎస్.థమన్ ఎడిటర్- కార్తీక్ శ్రీనివాస్ ఆర్ట్- కిరణ్ కుమార్ పి.ఆర్.వొ- ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను కథ- షేక్ దావూద్ మాటలు- హర్షవర్దన్ డాన్స్- ప్రేమ్ రక్షిత్ యాక్షన్- విలియమ్ ఓ.ఎన్.జి, రామ్-లక్ష్మణ్, రవివర్మ, జష్వా.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







