పోలీస్ గా రానున్న రవితేజ

- July 28, 2016 , by Maagulf
పోలీస్ గా రానున్న రవితేజ

మాస్ మహరాజ్ రవితేజ మేకప్ వేసుకొని నెలలు గడిచిపోతోంది. బెంగాళ్ టైగర్ సినిమాతో మంచి విజయం సాధించినా.. తరువాత సినిమా ఎంపికలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఈ మాస్ హీరో. మూడు ప్రాజెక్ట్ లు ప్రారంభమైనట్టే అనిపించినా... అవి వెనక్కి వెళ్లిపోయాయి. తాజాగా మరో సినిమాను రవితేజ కన్ఫామ్ చేశాడన్న వార్త వినిపిస్తోంది.రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన విక్రమ్ సిరి దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విక్రమార్కుడు, పవర్ సినిమాల్లో పోలీస్ గెటప్ లో అదరగొట్టిన రవితేజ, ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో అలరించనున్నాడట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com