NDWBFలో ఖతార్.. భారత్ తో బలమైన సంబంధాలు..!!
- January 11, 2026
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పుస్తక ప్రదర్శనలో గౌరవ అతిథిగా ఖతార్ సంస్కృతి శాఖ మంత్రి షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు.సంస్కృతి మరియు విజ్ఞానం మానవ సంబంధాలకు వారధులుగా ఖతార్, భారత్ ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోపాటు స్పెయిన్ సంస్కృతి శాఖ మంత్రి ఎర్నెస్ట్ ఉర్టాసున్,భారత్ లో ఖతార్ రాయబారి మహమ్మద్ హసన్ అల్ జాబిర్, సంస్కృతి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ఘనేమ్ బిన్ ముబారక్ అల్ అలీ, అలాగే పలువురు అధికారులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ఈ అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఉండటం పట్ల ఖతార్ గర్విస్తోందని షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ హమద్ అల్-థానీ అన్నారు. రెండు దేశాల నాగరికతలను నిర్మించడంలో పుస్తకాలు పోషించే కీలక పాత్రను న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన ప్రతిబింబిస్తుందని అన్నారు.తనకు లభించిన ఆత్మీయ స్వాగతానికి మరియు మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







