సినిమా రివ్యూ: ‘మన శంకర వర ప్రసాద్ గారు.!’
- January 12, 2026
‘మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు..’ అంటూ సరికొత్త టైటిల్‌తో కాదు.. కాదు చిరంజీవి ఒరిజినల్ పేరునే టైటిల్‌గా పెట్టేసి అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్‌గా సంక్రాంతికి పూర్తి చేసి రిలీజ్ చేసిన సినిమానే ‘మన శంకర వర ప్రసాద్ గారు’. దర్శకుడిగా అపజయమంటూ ఎరుగని అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవితో మరుపు రాని తిరిగి రాని బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరిపోయింది. చాలా తక్కువ టైమ్‌లో పర్‌ఫెక్ట్ పండగ సినిమాలా ఈ సినిమాని తెరకెక్కించాడని సినిమా చూసిన ప్రతీ ఒక్కరి నుంచీ అభిప్రాయాలు వస్తున్నాయంటేనే ఈ సినిమా ఏ రేంజ్‌లో పండక్కి రికార్డులు కొల్లగొట్టడానికి సిద్ధమైందో అర్ధం చేసేసుకోవచ్చు. ఇక సినిమా ఎలా వుందో తెలియాలంటే మొదట కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
కేంద్ర రక్షణ మంత్రి (శరత్ సక్సేనా)కి సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకర్ వర ప్రసాద్ (మెగాస్టార్ చిరంజీవి), ప్రముఖ బిలియనీర్ అయిన జీవీఆర్ (సచిన్ ఖేడ్కర్) కూతురు శశి రేఖ (నయన తార)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు పిల్లలు పుట్టాకా అనుకోని కారణాలతో వారిద్దరూ విడాకులు తీసుకోవల్సి వస్తుంది. పిల్లలకు దూరం కాలేక, NIA ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పిల్లలు చదివే స్కూల్‌లోనే పీటీ టీచర్‌గా జాయిన్ అవుతాడు శంకర్ వర ప్రసాద్. అలాగే, మాజీ భార్య శశి రేఖ ఇంట్లోనూ అడుగు పెడతాడు. ఓ వైపు మామగారు, మరోవైపు భార్య కోప తాపాలను భరిస్తూ ఆ ఇంట్లో వర ప్రసాద్ ఎలా వుండగలిగాడు.? చిన్నతనంలోనే పిల్లలకు దూరమైపోయిన శంకర వర ప్రసాదే తమ తండ్రి అని ఆ పిల్లలు తెలుసుకున్నారా.? విడిపోయిన భార్య భర్తలు మళ్లీ ఒక్కటయ్యారా.? ఈ ఫ్యామిలీ డ్రామాలో కర్ణాటక నుంచి వచ్చిన మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ (వెంకటేష్) పాత్ర ఏంటీ.? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే అస్సలు ఆలస్యం చేయకుండా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా మిస్ చేయకుండా ధియేటర్లలో చూసేయాల్సిందే.!
నటీ నటుల పని తీరు:
మన శంకర వర ప్రసాద్ గారు.. మెగాస్టార్ చిరంజీవి గారు.. గురించి ఏం చెప్పుకోవాలి. రాజకీయాల పేరు చెప్పి తొమ్మిదేళ్లు సినిమాలకి దూరంగా వుండి రీ ఎంట్రీలో ఒక్కో సినిమా ఒక్కో రకంగా అదరగొడుతూనే వున్నారు. అయితే, అసలు సిసలు మెగాస్టార్ చిరంజీవి అంటే మన శంకర వర ప్రసాద్ కదా.! బాస్ ఈజ్ బ్యాక్ నౌ.. అనేలా ఈ సినిమాలో ఆయన నటన, కామెడీ టైమింగ్‌తో అలరించారు. ఇక బాస్ ఈజ్ బ్యాక్ అన్నాకా.. ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏముంటుంది.! నెక్స్‌ట్ శశి రేఖగా నయన తార పాత్రలో మరొక హీరోయిన్‌ని ఊహించుకోలేం. పర్‌ఫెక్ట్ సెలెక్షన్ ఆ పాత్రకు నయన తార. తన లుక్స్, పర్‌ఫామెన్స్‌తో కేక పుట్టించింది. చిరంజీవికి తగ్గ జోడీగా కనిపించి మెప్పించింది. మామగారి పాత్రలో సచిన్ ఖేడ్కర్ ఆయన అనుభవం రంగరించారు. మామా అల్లుళ్ల మధ్య వచ్చే కాంబినేషన్ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి ఛిల్ ఇస్తాయ్. చిరంజీవి తల్లి పాత్ర పోషించిన జరీనా వాహెబ్.. అత్తా కోడళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగం రేపుతూనే, చాలా నేచురల్‌గా అనిపిస్తాయ్. జ్వాల పాత్రలో కేథరీన్ పాత్ర బాగుంది. అభినవ్ గోమటం, రఘుబాబు తదితరులు వాళ్ల పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ఏం చెప్పాలి.? ప్రేక్షకుల పల్స్‌ని బాగా పట్టేసిన దర్శకుడు. చిరంజీవి రీ ఎంట్రీలో చేసిన సినిమాలన్నింటిలోకెల్లా.. ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలని కోరుకుంటారో అలాగే వింటేజ్ చిరంజీవిని చూపించేశాడు. ఎక్కడా వదల్లేదు. చిరంజీవి పాత సినిమాల్లోని పాటల్ని వాడేశాడు. కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే, ‘వావ్’ అనిపించేస్తాడు. స్కూల్ ఎపిసోడ్ కాస్త బోరింగ్ అనిపించినా అది కూడా తెలియనివ్వలేదు. విడాకుల సన్నివేశంలో కాస్త మెసేజ్ కూడా జోడించాడు. కామెడీగానే చెప్పినా.. కన్విన్సింగ్‌గా చెప్పడంతో ప్రేక్షకుడిని ఆలోచింపచేసేలా వుంటుందా సన్నివేశం. ఇక సెకండాఫ్‌లో వెంకీ ఎంట్రీతో ఇచ్చిన జోరు అంతా ఇంతా కాదు.. ఒకరి పాటలకు ఒకరు డాన్సులేయడం దగ్గర్నుంచీ, సంక్రాంతి పాట వరకూ నెక్స్‌ట్ లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్.. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్. కథ, కాకరకాయ్‌తో సంబంధం లేకుండా.. ఫ్యాన్స్‌కి కాదు కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఏం కావాలో అదే కథనంగా నడిపించి హీరో అయిపోయాడు దర్శకుడిగా మరోసారి అనిల్ రావిపూడి. ఇక భీమ్స్ సిసిరోలియో పాటలు సినిమా రిలీజ్‌కి ముందే మాట్లాడేశాయ్. మాటలు కాదు, రికార్డులే కొల్లగొట్టేశాయ్. అలాగే బీజీఎమ్ కూడా సినిమాకి తగ్గట్లుగా అదరగొట్టేశాడు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా వుంది. ఎడిటింగ్ ఎక్కడా వంకలు పెట్టడానికి లేదు. సుస్మిత నిర్మాణ విలువలు చాలా బాగున్నాయ్. ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్:
అక్కడున్నది చిరంజీవి.. అందులోనూ శంకర్ వర ప్రసాద్ గారూ.. అంతకన్నా ఇంకేం కావాలి ప్లస్సూ.. అన్నీ ప్లస్ పాయింట్సే ఈ సినిమాకి. మెగాకి విక్టరీ కూడా తోడై వచ్చిన మాస్ మెగా విక్టరీ..
మైనస్ పాయింట్స్:
సారీ బాస్.. అడగొద్దు మైనస్.!
చివరిగా:
మన శంకర్ వర ప్రసాద్ గారూ.! పండక్కి వచ్చారు.! చెప్పినట్లే వినోదాన్నీ, అసలు సిసలు పండగనీ తెచ్చేశారూ.! ఇంకెందుకాలస్యం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కట్ట కట్టుకుని ఖచ్చితంగా ఒక్కసారైనా చూసేయాల్సిందే.. ఫ్యాన్స్ అయితే నచ్చినన్ని సార్లూ చూసి తీరాల్సిందే.! మన శంకర్ వర ప్రసాదుగారా.? మజాకానా.!
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







