MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- January 12, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి మరియు దేశీయ, విదేశీ పెట్టుబడును ఆకర్షించడానికి ఎలక్ట్రానిక్ సేవలను విస్తరించింది. MoCI యొక్క సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్ లో వ్యాపార అనుమతి ప్రక్రియలను సులభతరం చేయడం, వినియోగదారులకు సేవలను మరింత చేరువ చేయడానికి కొత్తగా 13 ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించారు.
అధికారిక గణంకాల ప్రకారం.. గత సంవత్సరం మూడవ త్రైమాసికం వరకు ప్రాసెస్ చేయబడిన మొత్తం లావాదేవీల సంఖ్య 72,500కి చేరుకున్నాయి. వాటిలో 89 శాతం సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా పూర్తి చేశారు. ఈ సేవలపై కస్టమర్ సంతృప్తి రేటు 94 శాతంగా ఉంది.
2026లో మేధో సంపత్తి హక్కుల రక్షణను బలోపేతం చేయడం ద్వారా పోటీతత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







